प्रतिबम्बवत् गुणाः

Super User

శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యులవారి పాదధూళి ఇంకనూ ఎటువంటిదనిన

ఉత్కంఠాకుంఠకోలాహలజవవిదితాజస్రసేవానువృద్ధ

ప్రాజ్ఞాత్మజ్ఞానధూతాంధతమససుమనోమౌలిరత్నావలీనాం .

భక్త్యుద్రేకావగాఢప్రఘటనసఘటాత్కారసంఘృష్యమాణ-

ప్రాంతప్రాగ్ర్యాంఘ్రిపీఠోత్థితకనకరజఃపింజరారంజితాశాః ..2..

శ్లోకాన్వయము

1. ఉత్కంఠాకుంఠకోలాహలజవవిదితాజస్రసేవానువృద్ధప్రాజ్ఞాత్మజ్ఞానధూతాంధతమససుమనోమౌలిరత్నావలీనాం

2. భక్త్యుద్రేకావగాఢప్రఘటనసఘటాత్కారసంఘృష్యమాణప్రాంతప్రాగ్ర్యాంఘ్రిపీఠోత్థితకనకరజఃపింజరారంజితాశాః

3. పాంసవః పునంతు

తాత్పర్యము

ఉత్కంఠచే అప్రతిహతమైన నేను ముందు నేను ముందు అను కోలాహలపు రభసచే తెలియదగు నిత్యసేవచే ఉప్పొంగు పరమాత్ముని జ్ఞానమువలన అంధంతమస్సును నివాళించిన దేవతల కిరీటపు నవరత్నాల శ్రేణుల భక్త్యుద్రేకమున కలుగు బలవంతమైన ఘర్షణముతో కూడిన పాదపీఠమునుండి వెదజిమ్ము బంగారపు ధూళితో మిశ్రితమై దిక్కులను రంజింపజేయు శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యులవారి పాదరజములు మమ్ములను పవిత్రీకరించుగాక.

వివరణము

దేవతలందరూ శ్రీమదాచార్యుల సేవలో ఉత్కంఠభరితులై సేవజేసెదరు. నవరత్నఖచితమైన కిరీటములను ధరించి నే ముందు నే ముందు అని అదునులేని కోలాహలముతో కూడినవారై వేగముగా పాదపీఠమునకు నమస్కరించి నిత్యము సేవచేయుటకై తహతహలాడుచుందురు. అటువంటి సేవచే వారికి భగవంతుని జ్ఞానము పూర్ణముగ కలుగును. జ్ఞానసామర్థ్యముతో అంధంతమస్సును తిరస్కరించెదరు. నమస్కరించు కాలములో వారి కిరీడము రత్నములు సువర్ణమయమైన పాదపీఠమునకు ఢీకొనునప్పుడి ఆ పాదపూఠమునుంటి బంగారపు ధూళి వెదజిమ్ముచూ పాదరజస్సుచే మిశ్రితమై రక్తవర్ణముచే నలుదిక్కులనూ రంజింపజేయును. అటువంటి పాదధూళి మమ్ములను పవిత్రీకరించుగాక అని తాత్పర్యము.

పదవివరణము

ఉత్కంఠ - ఉత్కంఠులై

అకుంఠకోలాహల – అదమ్యమైన కోలాహలము

జవ - వేగము

విదిత - తెలియబడిన

అజస్రసేవా – సతత సేవా

అనువృద్ధ - పెంపొందిన

ప్రాజ్ఞాత్మజ్ఞాన - భగవద్విషయకజ్ఞానము

ధూతాంధతమస – పరిహరింపబడిన అంధంతమస్సు కలవారై

సుమనోమౌలి – దేవతల కిరీటములపైనున్న

రత్నావలీనాం – రత్నాల పేర్లచే

భక్త్యుద్రేక - భక్త్యుద్రేకముచే

అవగాఢ -

ప్రఘటన

సఘటాత్కారసంఘృష్యమాణప్రాంత

ప్రాగ్ర్యాంఘ్రిపీఠోత్థిత

కనకరజఃపింజర

ఆరంజితాశాః