వాయుస్తుతి - 1

Super User

అస్యావిష్కర్తుకామం కలిమలకలుషేస్మిన్ జనే జ్ఞానమార్గం

వంద్యం చంద్రేంద్రరుద్రద్యుమణిఫణివయోనాయకాద్యైరిహాద్య .

మధ్వాఖ్యం మంత్రసిద్ధం కిముత కృతవతో మారుతస్యావతారం

పాతారం పారమేష్ఠ్యం పదమపవిపదః ప్రాప్తురాపన్నపుంసాం ..4..

అన్వయము

1.అద్య ఇహ

2.కలిమలకలుషే అస్మిన్ జనే

3.జ్ఞానమార్గం ఆవిష్కర్తుకామం

4.చంద్రేంద్రరుద్రద్యుమణిఫణివయోనాయకాద్యైః వంద్యం

5.మంత్రసిద్ధం

6.ఆపన్నపుంసాం

7.పాతారం

8.మధ్వాఖ్యం అవతారం కృతవతః

9.పారమేష్ఠ్యం పదం ప్రాప్తుః

10.అపవిపదః

11.మారుతస్య సంస్తవే

12.శక్తః న అస్మి

తాత్పర్యము

ఈ భూలోకమునందు కలికాలముయొక్క దోషముచే కలుషితమైన మనవంటి జనులకు జ్ఞానమార్గమును ఆవిష్కరించు ఉద్దేశ్యముగల, చంద్ర, ఇంద్ర, రుద్ర, సూర్య, శేష, గరుడాదులచే నమస్కరింపబడునటువంటి వేదసిద్దమైనటువంటి ఆపన్నులైనవారిని రక్షించునటువంటి మధ్వ అను నామముగల అవతారమును చేసినటువంటి బ్రహ్మపదవిని పొందునటువంటి, ఎటువంటి విపత్తు లేనటువంటి వాయుదేవులను స్తుతించుటకు నేను అశక్తుడను కదా!

వివరణము

ఇప్పటి కాలంలో జనులందరు కలికాలముయొక్క దోషములైన కామ, క్రోధాధులచే పరితప్తులౌతున్నారు. కలికాలముయొక్క దోషముయొక్క ఉపశమము కలగవలెననిన జ్ఞానసంపాదనము చేయవలెను. ఐతే ఈ కలికాలములో జ్ఞానసంపాదనము సులభము కాదు. జ్ఞానమార్గమేది అనునది జనులకు తెలియకుండుటే దీనికి కారణము. శ్రీవాయుదేవలు ఆచార్యమధ్వులై అవతరించింది ఈ కలియుగంలో జ్ఞానమార్గమును తెలియజేయుటకే. వీరిని చంద్ర, ఇంద్ర, రుద్ర, సూర్య, శేష, గరుడాదులు కూడా నమస్కరించెదరు. వీరి అవతారము వేదప్రతిపాద్యమైనటువంటిది. బళిత్ధా తద్వపుషే .. దశప్రమతిం జనయంత యోషణః అను శ్రుతులలో విశేషముగ వర్ణింపబడినది. శరణుపొందినవారిని రక్షించే స్వభావముగలది. మధ్వ అను నామాంకితమైనటువంటిది. రాబోయే కల్పములో బ్రహ్మపదవిని పొందునటువంటిది. ఎటువంటి విపత్తు లేనటువంటిది. అటువంటి వాయుదేవుల స్తుతిని చేయుటకు నాలో ఎటువంటి సామర్థ్యము లేదు అని అభిప్రాయము.

పదవివరణము

అద్య – ఇందు

ఇహ - ఇచ్చట

కలిమలకలుషే – కలికాలమలముచే కలుషితమైన

అస్మిన్ జనే – మనవంటివారికి

జ్ఞానమార్గం – జ్ఞానమార్గమును

ఆవిష్కర్తుకామం – ఆవిష్కరింపజేయు ఇఛ్ఛగల

చంద్రేంద్రరుద్రద్యుమణిఫణివయోనాయకాద్యైః వంద్యం – చంద్రేంద్రాలుచే నమస్కరించబడు

మంత్రసిద్ధం – వేదసిద్ధమైన

ఆపన్నపుంసాం పాతారం – శరణుపొందినవారికి రక్షకమైన

మధ్వాఖ్యం అవతారం కృతవతః – మధ్వావతారమును స్వీకరించిన

పారమేష్ఠ్యం పదం ప్రాప్తుః  - బ్రహ్మపదవిని పొందగల

అపవిపదః – ఆపత్తురహితమైన

మారుతస్య - వైయుదేవులయొక్క

సంస్తవే శక్తః న అస్మి  - స్తోత్రముచేయుటకు నేను అసమర్థుడను అద్య ఇహ కలిమలకలుషే అస్మిన్ జనే జ్ఞానమార్గం ఆవిష్కర్తుకామం చంద్రేంద్రరుద్రద్యుమణిఫణివయోనాయకాద్యైః వంద్యం మంత్రసిద్ధం ఆపన్నపుంసాం పాతారం మధ్వాఖ్యం అవతారం కృతవతః పారమేష్ఠ్యం పదం ప్రాప్తుః అపవిపదః మారుతస్య సంస్తవే శక్తః న అస్మి