Manduka Upanishad Bhashyam

Super User

వాయుస్తుతి – 6

అవతరణికా

ఆధ్యాత్మికములు, ఆధిదైవికములు, ఆధిభౌతికములని సంసారమునందు కలుగు అనిష్టములు మూడు విధములుగానుండును. ఇటువంటి సంసారమునకలుగు అరిష్టముల శాంతి కలుగు ఉపాయమేమనగా శ్రీమదానందతీర్థభగవత్పాదులను ఆశ్రయించుటయే. శ్రీమదాచార్యులు క్షీరసాగరమువంటివారు. క్షీరసాగరము ఆశ్రయించువారి త్రివిధ తాపములను ఉపశమింపజేయును. అటువంటి ఆచార్యులను సకలవిధానిష్టశాంతికై ప్రార్థించుచున్నారు

సంసారోత్తాపనిత్యోపశమదసదయస్నేహహాసాంబుపూర-

ప్రోద్యద్విద్యానవద్యద్యుతిమణికిరణశ్రేణిసంపూరితాశః .

శ్రీవత్సాంకాధివాసోచితతరసరలశ్రీమదానందతీర్థ-

క్షీరాంబోధిర్విభింద్యాద్భవదనభిమతం భూరి మే భూతిహేతుః ..6..

అన్వయము

సంసారోత్తాపనిత్యోపశమదసదయస్నేహహాసాంబుపూరప్రోద్యద్విద్యానవద్యద్యుతిమణికిరణశ్రేణిసంపూరితాశః .

శ్రీవత్సాంకాధివాసోచితతరసరలః

భూతిహేతుః

శ్రీమదానందతీర్థక్షీరాంబోధిః

భవత్ భూరి మే అనభిమతం విభింద్యాత్

తాత్పర్యము

సంసారముయొక్క అధికతాపములరు ఉపశమనమును కలిగింపజేయు కరుణచే కూడినటువంటి స్నేహపూరితమైన మందహాసమనెడి నీటితో నిండినటువంటి ప్రకాశమానమైనటువంటి శుద్ధ విద్య అనెడి నిర్దుష్ట కాంతిని వెదడల్లు మణికిరణములచే దిక్కులను పూరింపజేయునటువంటి శ్రీవత్సుడైన పరమాత్మునకు ఉచిమైన ఆశ్రయమైనటువంటి  ఐశ్వర్యమునకు కారణమైన శ్రీమదానందతీర్థక్షీరసాగరము సంభవించు నా సకల అనిష్టములను భేదించని.