వాయుస్తుతి - 8

Dr. Rachuri Acharya

అవతరణికా

వాయుదేవుల తృతీయ అవతారమును సేవించువారికి వైకుంఠలోకము కలుగును. అచ్చట వారు స్వరూపసుఖముతో పాటుగా నానావిధమైన లౌకిక భోగములనుకూడా అనుభవింతురు అని ఈ శ్లోకములో చెప్పుచున్నారు

యోముం భావం భజంతే సురముఖసుజనారాధితం తే తృతీయం

భాసంతే భాసురైస్తే సహచరచలితైశ్చామరైశ్చారువేషాః .

వైకుంఠే కంఠలగ్నస్థిరశుచివిలసత్కాంతితారుణ్యలీలా

లావణ్యాపూర్ణకాంతాకుచభరసులభాశ్లేషసమ్మోదసాంద్రాః ..9..

అన్వయము

హే ముఖ్యప్రాణ, యే అముం సురముఖసుజనారాధితం తే తృతీయం భావం భజంతే తే భాసురైః సహచరచలితైః చామరైః కంఠలగ్నస్థిరశుచివిలసత్కాంతితారుణ్యలీలాలావణ్యాపూర్ణకాంతాకుచభరసులభాశ్లేషసమ్మోదసాంద్రాః సంతః వైకుంఠే భాసంతే .

తాత్పర్యము

హే ముఖ్యప్రాణ, ఏవరైతే నీయొక్క ఈ దేవాదులచే పూజింపబడు తృతీయావతారమును (మధ్వావతారమునను) పూజింతురో వారు సహచరీమణులచే వీచబడు ప్రకాశించు చామరలతో కూడినవారై స్థిరమైన శుచియైన శోభాయమామమైన ప్రకాశము తారుణ్యము లీలా లావమ్యములచే పరిపూర్ణమైన కాంతల కుచముల సులభాలింగనమును పొందుచు సుఖించెదరు.