వాయుస్తుతి - 10

Dr. Rachuri Acharya

అవతరణికా

ముక్తలోకమైన వైకుంఠమును వర్ణించుచున్నారు

ఆనందాన్మందమందా దదతి హి మరుతః కుందమందారనంద్యా

వర్తామోదాన్ దధానా మృదుపదముదితోద్గీతకైః సుందరీణాం .

వృందైరావంద్యముక్తేంద్వహిమగుమదనాహీంద్రదేవేంద్రసేవ్యే

మౌకుందే మందిరేస్మిన్నవిరతముదయన్మోదినాం దేవదేవ ..10..

అన్వయము

హే దేవదేవ, మందమందాః కుందమందారనంద్యావర్తామోదాన్ దధానాః మరుతః మృదుపదం ఉదితోద్గీతకైః సుందరీణాం వృందైః ఆవంద్యముక్తేంద్వహిమగుమదనాహీంద్రదేవేంద్రసేవ్యే మౌకుందే అస్నిన్ మందిరే అవిరతం ఉదయన్మోదినాం ఆనందాన్ దదతి హి .

తాత్పర్యము

హే దేవదేవ, మధురమైన పదములతో కూడిన గానములచే సుందరీమణుల సమూహములచే అందరిచే పూజింపబడు ముక్తులైనటువంటి చంద్ర, సూర్య, కామ, శేష, దేవేంద్రాదులచే సేవింపబడు మెల్లమెల్లగ వీచు కుంద, మందార, నంద్యావర్తముమైదలైనటువంటి పుష్పముల సుగంధముతో మిశ్రితమైన పిల్లగాలి మిక్కిలి ఆనందపరచును